టీచరు వలెంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2020-07-28T11:09:51+05:30 IST

నాన్‌ రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) టీచర్‌ వలెంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ..

టీచరు వలెంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

నెల్లూరు (సాంస్కృతికం), జూలై 27 : నాన్‌ రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) టీచర్‌ వలెంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీఎన్‌ఆర్‌ఎస్‌టీసీ టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు కే ప్రమీల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యూనియన్‌ కమిటీ సభ్యులతో కలిసి ఆమె సోమవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తాము 1990 నుంచి  ప్రాథమిక పాఠశాలల్లో టీచరు వలెంటీర్లుగా పనిచేస్తున్నామన్నారు. తమకు రూ.500 నుంచి రూ.7500 వరకు దఫాల వారీగా పారితోషికం పెంచారన్నారు. విద్యాబోధనలో 20 ఏళ్ల అనుభవం ఉన్న తమను శాశ్వత టీచర్లుగా నియమించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది వలెంటీర్లు ఉన్నారని, ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని, జీతాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుధాకర్‌, సునీత, వాసవి, నాగరత్నమ్మ, లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-28T11:09:51+05:30 IST