ఫిషింగ్‌ హార్బర్‌ స్థల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-29T04:14:20+05:30 IST

బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీలోని ఫిషింగ్‌ హార్బర్‌కు ప్రభుత్వం కేటాయించిన భూములను జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్

ఫిషింగ్‌ హార్బర్‌ స్థల పరిశీలన
మ్యాప్‌లో వివరాలు తెలుసుకుంటున్న జేసీ హరేందిర ప్రసాద్‌

బిట్రగుంట, డిసెంబరు 28: బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీలోని ఫిషింగ్‌ హార్బర్‌కు ప్రభుత్వం కేటాయించిన భూములను జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ సోమవారం పరిశీలించారు. తహసీల్దారు కార్యాలయంలో జూమ్‌ వీడియో సమావేశ అనంతరం తహసీల్దారు బాలమురళీకృష్ణతో కలసి భూ పరిశీలనకు వెళ్లారు. ఆయనకు 76.89 ఎకరాలకు సంబంధించిన భూ వివరాలను సర్వేయర్‌ వెంకటేశ్వర్లు మ్యాప్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థల పరిశీలన పూర్తి చేసి సంబధిత అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా నిర్మాణం ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆయన వెంట కావలి ఎఫ్‌డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో నాసరరెడ్డి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-12-29T04:14:20+05:30 IST