ప్రభుత్వ కార్యాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2020-11-20T05:05:13+05:30 IST

స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి గురువారం తనిఖీ చేశారు. రెవె న్యూ కార్యాలయం, ప్రభుత్వ

ప్రభుత్వ కార్యాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
సంగం -3 సచివాలయంలో నోటీస్‌ బోర్డును పరిశీలిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

   సంగం, నవంబరు 19: స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి గురువారం తనిఖీ చేశారు. రెవె న్యూ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాల, సచివాలయం, ఆర్బీకే కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రికార్డులు చూశారు. వైద్యశాలలో రోగులను ప్రశ్నించి వైద్యసేవలపై ఆరా తీశారు. అధికారులకు సూచనలు సలహాలు అందచేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సిద్దీపురం పాఠశాల్లో నాడు - నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో నిధులు మంజూరైన సచివాలయాల భవనాలు, ఆర్బీకే కేంద్రాల భవనాలు, హెల్త్‌ క్లినిక్‌ సెంటర్ల నిర్మాణాలను చేపట్టి పను లు వేగవంతంగా చేయాలని సూచించారు. ఇప్పటి వరకు స్థలాలు కేటాయించకపోతే వెంటనే స్థల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దారు నిర్మలానందబాబాకు సూచించారు. అదేవిధంగా భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు - నేడు పథకంలో జిల్లాలో 1060 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. డిసెంబరు నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేంద్రబాబు, తహసీల్దారు నిర్మలానందబాబా, వైద్యాధికారి ప్రతిమ, ఏపీఎం సుజాత, ఏపీవో శ్రీనివాసరావు, ఏఈలు మల్లిఖార్జునరావు, బ్రహ్మ య్య, కరీముల్లా, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  

Updated Date - 2020-11-20T05:05:13+05:30 IST