రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-08T04:53:38+05:30 IST

నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు మనుక్రాంత్‌ రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
దీక్షలో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, మనుక్రాంత్‌రెడ్డి

జనసేన నాయకులు మనుక్రాంత్‌, కేతంరెడ్డి

కలెక్టరేట్‌ ఎదుట దీక్ష


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 7 : నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు మనుక్రాంత్‌ రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట జైకిసాన్‌ పేరుతో జనసేన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం నివర్‌ తుఫాన్‌ బాధితులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రైతుల కష్టాలు తెలుసుకుంటూ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు కనీసం భరోసా ఇవ్వలేక పోయిందన్నారు. నివర్‌ వలన రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, బాధిత రైతులకు ఎకరానికి రూ. 35వేలు వంతున ఈ నెల 25లోపు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తక్షణ సాయంగా రూ.10వేలు పరిహారం అందించాలన్నారు. రైతులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ దీక్ష శిబిరాన్ని బీజేపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు భరత్‌కుమార్‌యాదవ్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్‌రెడ్డి, కాకు మురళిరెడ్డి, రైతులు శీనయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T04:53:38+05:30 IST