ఐదుగురు మహిళా ఖైదీల స్వేచ్ఛ

ABN , First Publish Date - 2020-11-28T04:51:56+05:30 IST

జిల్లా కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న ఐదుగురు మహిళా ఖైదీలు ప్రభుత్వ క్షమాభిక్షతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.

ఐదుగురు మహిళా ఖైదీల స్వేచ్ఛ
జైలు నుంచి విడుదలవుతున్న మహిళలు

ప్రభుత్వ క్షమాభిక్షతో విడుదల

ఇకపై ఉన్నతంగా జీవించండి

కారాగార సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు


నెల్లూరు(క్రైం), నవంబరు 27: జిల్లా కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న ఐదుగురు మహిళా ఖైదీలు ప్రభుత్వ క్షమాభిక్షతో  శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ విడుదల చేసిన జీవో ఆధారంగా ఎం మంజుల అలియాస్‌ విజయ, సీహెచ్‌ కృష్ణవేణి, ఎస్‌ సావిత్రమ్మ, ఎస్‌ రాజమ్మ, డీ రాణిలను జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ బీ రాజేశ్వరరావు విడుదల చేశారు. ఇకపై సమాజంలో ఉన్నతంగా జీవించాలని సూచించారు. వారికి చిన్న జీయర్‌స్వామి చారిటబుల్‌ ట్రస్టు సహకారంతో కుట్టు మిషన్లు, మహాయాగ హెల్పింగ్‌ సొసైటీ, రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంకు సహకారంతో చీరలు, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఏబీ కాంతరాజు, ఎం మహేష్‌బాబు, జైలర్లు జీవై నాయుడు, ఎస్‌ శ్రీనివాసరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T04:51:56+05:30 IST