-
-
Home » Andhra Pradesh » Nellore » jagananna todu
-
60,867 మందికి రూ.60.86 కోట్లు
ABN , First Publish Date - 2020-11-26T04:47:51+05:30 IST
జగనన్న తోడు పథకం ద్వారా బుధవారం జిల్లాలో 60,867 మందికి రూ.60.86 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి.

‘జగనన్నతోడు’ పథకం ద్వారా లబ్ధి
నెల్లూరు(హరనాథపురం), నవంబరు 25 : జగనన్న తోడు పథకం ద్వారా బుధవారం జిల్లాలో 60,867 మందికి రూ.60.86 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించగా, నెల్లూరు జడ్పీ డీఈఓసీ నుంచి కలెక్టర్ చక్రధర్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సున్నా వడ్డీకే ఈ పథకం ద్వారా రూ.10వేల రుణం అందచేశారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ నాగలక్ష్మి, జడ్పీ సీఈఓ సుశీల తదితరులు పాల్గొన్నారు.