మూడో విడత ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
ABN , First Publish Date - 2020-12-06T04:09:12+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2020-2021 సంవత్సరంలో ప్రవేశం కోసం మూడో విడత దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)డిసెంబరు 5: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2020-2021 సంవత్సరంలో ప్రవేశం కోసం మూడో విడత దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15న జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో, 17న ప్రైవేట్ ఐటీఐలలో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తామని తెలిపారు.