నేడు ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2020-12-04T02:41:48+05:30 IST
మినీ ట్రక్కుల కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తునట్లు ఎంపీడీవో నాసరరెడ్డి గురువారం
బిట్రగుంట, డిసెంబరు 3: మినీ ట్రక్కుల కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తునట్లు ఎంపీడీవో నాసరరెడ్డి గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులో జత పరచిన ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్‌ను, ఆఽధార్ కార్డుతోపాటు ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో హాజరు కావాలని కోరారు.
కొండాపురంలో..
కొండాపురం, డిసెంబరు3: మినీట్రక్కుల లబ్ధిదారుల ఎంపికకు శుక్రవారం ఇంటర్వ్యూలు జరుగుతాయని ఎంపీడీవో ఎమ్.బ్రహ్మయ్య గురువారం తెలిపారు. మండలపరిధిలో ఎస్సీ-3, ఎస్టీ-1, బీసీ-2, ఈబీసీ-1 ట్రక్కులు మంజూరవ్వగా 21 మంది అభ్యర్ధులు దరఖాస్తుచేసుకున్నారన్నారు. శుక్రవారం ఉదయం 10-30 గంటలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.