సమాజంలో అందరికీ సమాన హక్కులు

ABN , First Publish Date - 2020-12-11T05:22:01+05:30 IST

జాతి కుల లింగ బేధం లేకుండా సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం శ్రీనివాసులు నాయక్‌ పేర్కొన్నారు.

సమాజంలో అందరికీ సమాన హక్కులు
అన్నదానం చేస్తున్న నిర్వాహకులు

సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు నాయక్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట/సాంస్కృతిక ప్రతినిధి), డిసెంబరు 10: జాతి కుల లింగ బేధం లేకుండా సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం శ్రీనివాసులు నాయక్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయని, చిత్రహింసలు, వెట్టిచాకిరి, బానిసత్వం తదితరాలను రూపుమాపాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ఉడ్‌కాంప్లెక్స్‌లో పేదలకు అన్నదానం చేశారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీఆర్‌సీ కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహానికీ నివాళులర్పించారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్‌ చేసిన కృషి మరువలేనిదని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్‌ చౌహాన్‌ లక్ష్మణ్‌సింగ్‌, ఐదోనగర ఎస్‌ఐ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:22:01+05:30 IST