ఇంటర్‌ మూల్యాంకనం పూర్తి

ABN , First Publish Date - 2020-06-04T10:30:42+05:30 IST

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం బుధవారంతో పూర్తయింది.

ఇంటర్‌ మూల్యాంకనం పూర్తి

15లోగా ఫలితాల వెల్లడి


నెల్లూరు (విద్య), జూన్‌ 3 : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం బుధవారంతో పూర్తయింది. జిల్లాకు చేరిన 4,01,107 లక్షల జవాబు పత్రాలకు సంబంధించి మే 17వతేదీ నుంచి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభించి మూడు విడతల్లో పూర్తి చేశారు. 756 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్‌(ఏఈ), చీఫ్‌ ఎగ్జామినర్స్‌(సీఈ) 153 మంది, స్ర్కూటినైజర్లు 153 మంది కలిపి మొత్తం 1062 మంది విధుల్లో పాల్గొన్నట్లు ఆర్‌ఐవో మాల్యాద్రి చౌదరి తెలిపారు. జవాబు పత్రాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవాడలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి తరలిస్తున్నామన్నారు. ఫలితాలను ఈనెల 15వతేదీలోపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు. 

Updated Date - 2020-06-04T10:30:42+05:30 IST