ప్రాక్టికల్స్ పక్కాగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-02-08T07:15:00+05:30 IST
జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రయోగ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని

ఇంటర్ బోర్డు ఆర్‌జేడీ పద్మ
నెల్లూరు (విద్య) ఫిబ్రవరి 7 : జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రయోగ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎస్.పద్మ తెలిపారు. శుక్రవారం ఆమె పలు కేంద్రాలల్లో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులూ కల్పించాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్ర అధికారులు ఈ పరీక్షలను సీసీ కెమరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవకతవకలకు తావులేకుండా నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం జరిగిన పరీక్షకు మొత్తం 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జనరల్ విద్యార్థులు 1,464 మందికిగాను 1,444 మంది, ఒకేషనల్ విద్యార్థులు 359 మందికిగాను 333 మంది హాజరయ్యారు. మధ్నాహ్నం జనరల్ విద్యార్థులు 1,428 మందికిగాను 1,409 మంది, ఒకేషనల్ విద్యార్థులు 230 మందికిగాను 223 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణ తీరును ఆర్‌జేడీతో పాటు ఆర్‌ఐవో 2, డీఈసీ సభ్యులు 3, హెచ్‌పీసీ సబ్యులు 2, ఫ్లైయింగ్ స్క్వాడ్ 14 వెరసి 27 కేంద్రాలను పరిశీలించారు.