ఇండస్ర్టీయల్‌ హబ్‌గా కావలి తీరప్రాంతం

ABN , First Publish Date - 2020-11-20T04:16:38+05:30 IST

కావలి రూరల్‌ మండలంలోని తీరప్రాంతంలో ఇండస్ట్రీయల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేపడుతోందని ఆర్డీవో జీ.శ్రీనివాసులు తెలిపారు.

ఇండస్ర్టీయల్‌ హబ్‌గా కావలి తీరప్రాంతం

 6 వేల ఎకరాల భూసేకరణ 

 ఆర్డీవో శ్రీనివాసులు


కావలి, నవంబరు 19: కావలి రూరల్‌ మండలంలోని తీరప్రాంతంలో ఇండస్ట్రీయల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేపడుతోందని ఆర్డీవో జీ.శ్రీనివాసులు  తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండస్ట్రీయల్‌ హబ్‌కు అవసరమైన 6 వేల ఎకరాలను సేకరించి ఏపీఎస్‌ఐసీకి అప్పగిస్తే దాని ద్వారా పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందన్నారు. పరిశ్రమలు ఏర్పడితే కావలి ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అనేకమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కూడా కలుగుతాయని చెప్పారు. ఆ పరిశ్రమలను ఆధారం చేసుకుని పలు వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకా శాలు ఉన్నాయన్నారు. పారిశ్రామిక కేంద్రానికి 6 వేల ఎకరాలు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. వాటిలో తుమ్మలపెంటలో 3 వేల ఎకరాలు, చెన్నాయపాలెంలో 1400 ఎకరాలు, ఆనెమడుగులో 800 ఎకరాలు, సర్వాయపాలెం, కావలిలో 800 ఎకరాలు గుర్తించి భూ సేకరణ చేపడుతున్నామని వివరించారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం మంచి పరిహారం చెల్లిస్తుందని, అంతేకాక ఆ ప్రాంతం అభివృద్ధి చెంది వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు, పెద్దలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.

Updated Date - 2020-11-20T04:16:38+05:30 IST