రంగడి హుండీ ఆదాయం పెరిగింది
ABN , First Publish Date - 2020-12-29T05:34:49+05:30 IST
తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో సోమవారం హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది.
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 28 : తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో సోమవారం హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గతేడాది రూ.2,05,371లురాగా ఈ సంవత్సరం రూ.4,76,884లు వచ్చింది. గత సంవత్సరం టికెట్ల అమ్మకం ద్వారా రూ.7,26,620లు రాగా ఈ సంవత్సరం రూ.10,03,140లు వచ్చింది. మొత్తంగా ముక్కోటికి గతేడాది కంటే అదనంగా రూ.5,48,033లు ఆదాయం వచ్చిందని ఈవో డీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ సూపరింటెండెంట్ ఎన్ వెంకటరమణ, ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, పిగిలం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
వేదగిరి హుండీ ఆదాయం రూ. 11.83 లక్షలు
నెల్లూరు రూరల్, డిసెంబరు 28 : వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.11,83,395 వచ్చినట్లు ఆలయ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, ఈవో పీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. సోమవారం ఆలయంలో హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది. మే 19వ తేదీ నుంచి సోమవారం వరకు 7 నెలల కాలంలో భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలు లెక్కించారు.