పెరిగిన రద్దీ

ABN , First Publish Date - 2020-03-27T05:48:56+05:30 IST

గూడూరు పట్టణంలో ఫలసరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల

పెరిగిన రద్దీ

గూడూరు, మార్చి 26: గూడూరు పట్టణంలో  ఫలసరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకుసమయం కేటాయించారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కొనుగోలు చేసేందుకు రావడంతో రద్దీ పెరిగిపోతోంది. దీంతో దుకాణాలు, రోడ్లు జనంతో నిండిపోతున్నాయి. ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. ఈ పరిస్థితిని గుర్తించిన సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసుకోవచ్చునని ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2020-03-27T05:48:56+05:30 IST