-
-
Home » Andhra Pradesh » Nellore » in road accindent one person died
-
రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిలిస్టు మృతి
ABN , First Publish Date - 2020-12-29T04:36:02+05:30 IST
మండలంలోని కాపులూరు సమీపంలో సోమవారం మోటారు సైకిల్‌ను ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదంలో మోటారు సైకిలిస్టు మృతిచెందాడు.

నాయుడుపేట టౌన్, డిసెంబరు 28 : మండలంలోని కాపులూరు సమీపంలో సోమవారం మోటారు సైకిల్‌ను ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదంలో మోటారు సైకిలిస్టు మృతిచెందాడు. కాపులూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (44) మోటారు సైకిల్‌పై నాయుడుపేటకు వస్తుండగా గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొంది. దాంతో తీవ్రంగా గాయపడ్డ అతడిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.