వాణిజ్య బ్యాంకులకు దీటుగా..

ABN , First Publish Date - 2020-03-08T09:40:32+05:30 IST

ఓజిలిలో మహిళా బ్యాంకు లావాదే వీలను ఎవరెస్టు శిఖరం ఎక్కించారు ఆ బ్యాంకు మేనేజర్‌ సురేఖ. బ్యాంకు సారధిగా పనిచేస్తున్న

వాణిజ్య బ్యాంకులకు దీటుగా..

ఓజిలి : ఓజిలిలో మహిళా బ్యాంకు లావాదే వీలను ఎవరెస్టు శిఖరం ఎక్కించారు ఆ బ్యాంకు మేనేజర్‌ సురేఖ. బ్యాంకు సారధిగా పనిచేస్తున్న కురుగొండకు చెందిన ఆమె జిల్లాలోని మాక్స్‌ బ్యాంకుల్లో ఆదర్శవంతమైన మాక్స్‌గా తీర్చిదిద్ది జిల్లా అధికారుల మన్ననలు పొందారు. 2002 మే 25న ఓజిలిలో పొదుపులక్ష్మి సహాయ సహకార సంఘం (మాక్స్‌) ఏర్పాటైంది. అప్పట్లో  40 పొదుపు గ్రూపులు ఉంటే ప్రస్తుతం 350  గ్రూపులు కొనసాగుతున్నాయి. వీటిలో 200కు పైగా గ్రూపులు క్రమం తప్పని లావాదేవీలు నిర్వహి స్తున్నాయి. 


ఆదర్శంగా పనిచేస్తూ..

 ఎప్పటికప్పుడు పొదుపు సభ్యులతో మాట్లాడుతూ వారికి చేయూత అందించారు.  మహిళా బ్యాంకులో 300 మంది వరకు సభ్యులు రూ. 50 లక్షల మేరకు ఆర్‌డీలు కట్టుకుంటున్నారు. అలాగే రూ. 150 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు  చేశారు. మహిళాబ్యంకు అధ్యక్షురాలు పాడి పారిజాత, కార్యదర్శి కె ప్రజావతి, కోశాధికారి ఎన్‌ లలితమ్మలతోపాటు బ్యాంకు అకౌంటెంట్‌ రాజేశ్వరి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ నవనీతమ్మలు నిత్యం బ్యాంకు లావాదేవీలపై దృష్టిపెట్టేలా వారితో పనిచేయడం సురేఖ తన విజయరహస్యంగా చెబుతున్నారు. 


అందరి సహకారంతోనే...

అతితక్కువ పెట్టుబడితో బ్యాంకును ప్రారంభించాం. ఇప్పుడు ఇంతలా లావాదేవీలు నిర్వహిస్తున్నామంటే అందరి సహకారంతోనే సాధ్యమైంది. సాధించింది కొంతే... సాధించా ల్సింది ఇంకా ఎంతో ఉంది.

 జి సురేఖ, మహిళా బ్యాంకు మేనేజర్‌  

Updated Date - 2020-03-08T09:40:32+05:30 IST