మైనార్టీ నాయకుడిపై అధికారుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-11-14T02:30:46+05:30 IST

ముదివర్తి గ్రామానికి చెందిన టీడీపీ మైనార్టీ నాయకుడు ఇమాంబాషాపై శుక్రవారం మండలాధి కారులు దౌర్జాన్యానికి దిగారు.

మైనార్టీ నాయకుడిపై అధికారుల దౌర్జన్యం
ఇమాంబాషాతో వాగ్వాదానికి దిగిన అధికారులు

అడ్డుకున్న స్థానికులు

దురుసుగా ప్రవర్తించిన వీఆర్వో

ముదివర్తిలో ఉద్రిక్తత 


విడవలూరు, నవంబరు 13: ముదివర్తి గ్రామానికి చెందిన టీడీపీ మైనార్టీ నాయకుడు ఇమాంబాషాపై శుక్రవారం మండలాధి కారులు దౌర్జాన్యానికి దిగారు. ఇమాం బాషా కట్టుకున్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని, దానిని పడగొట్టాలని అధికారులు శుక్రవారం హల్‌చల్‌ చేశారు. ఇమాంబాషా తన పూర్వీకులు ఇచ్చిన స్థలంలో ఇటీవల ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే స్థానిక వైసీపీ నా యకులు అధికారులపై ఒత్తిడులు తీసుకువచ్చి ఆ ఇంటిని కూ ల్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు స్థానిక కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మద్దతు తెలపడంతో ఇంటిని తొల గించాలంటూ కలెక్టరు నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంటిని కూల్చే పక్రియలో భాగంగా తహసీల్దారు చంద్రశేఖర్‌, ఎంపీడీవో చిరంజీవి, ఆర్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, వీఆర్వో దయానందం గ్రామానికి చేరుకుని ఇంటిని సర్వే చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఇమాంబాషా తాను పూర్వీకులు ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నానని, రాజకీయ నాయకుల ఒత్తిడులకు తలొగ్గి అన్యాయంగా నా ఇంటిని పడగొ ట్టాలని ప్రయత్నించటం సరికాదన్నారు. గ్రామంలో అనేక ఇల్లు ప్ర భుత్వ స్థలాల్లో ఉన్నాయని, వాటిని సర్వే చేసిన తర్వాత నా ఇంటిని సర్వే చేయాలన్నారు. దీంతో వీఆర్వో దయానంద్‌ ఇమాంబాషాపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఇమాంబాషా, అధికారుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. స్థానికులు బాధితుడికి మద్దతుగా నిలిచి ఆందోళనకు దిగారు. వీఆర్వో దయానందం క్షమాపణ చెప్పాలని లేకుంటే ఇక్కడ నుంచి పంపేదీ లేదంటూ అధికారులను చుట్టుముట్టారు. దీంతో వీఆర్వో ఇమాంబాషాకి క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. 

Updated Date - 2020-11-14T02:30:46+05:30 IST