రూ.50 వేల మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-07T04:54:34+05:30 IST

ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి రూ.50 వేలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రూ.50 వేల మద్యం స్వాధీనం

నెల్లూరు రూరల్‌, డిసెంబరు 6 : ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి రూ.50 వేలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో నెల్లూరు రూరల్‌ సీఐ సూర్యనారాయణ ఆదివారం స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీ లీటర్‌ బాటిళ్లను నెల్లూరు రూరల్‌ మండలం పొట్టేపాళెంలోని నాయుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో 60 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముందస్తు సమాచారంతో ఆ ఇంటిపై దాడి చేశామన్నారు. అలాగే నెల్లూరు రూరల్‌ ప్రాంతం కొత్తూరు సెంటరు వద్ద వెంకటాచలం మండలం చవటపాళెంకు చెందిన సీహెచ్‌ శీనయ్యను అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని, అతని నుంచి 11 నిప్స్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Read more