ఇళ్లపట్టాల పంపిణీకి సర్వం సిద్ధం : ఆర్డీవో

ABN , First Publish Date - 2020-12-16T02:50:11+05:30 IST

ఈనెల25వ తేదీన ఇళ్లపట్టాల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, పంపిణీకి సర్వం సి

ఇళ్లపట్టాల పంపిణీకి సర్వం సిద్ధం : ఆర్డీవో
మనుబోలు : అక్కంపేటలో కొత్త లేఅవుట్‌ పనులను పరిశీలిస్తున్న నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌

 మనుబోలు, డిసెంబరు 15: ఈనెల25వ తేదీన ఇళ్లపట్టాల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, పంపిణీకి సర్వం సిద్ధం చేశామని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ అన్నారు. మండలంలోని అక్కంపేట సచివాలయాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రీసర్వేపై నిర్వహిస్తున్న గ్రామసభలో పాల్గొన్నారు. తరువాత గ్రామంలో ఇళ్లపట్టాల పంపిణీకి వేస్తున్న కొత్త లేఅవుట్‌ పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సర్వేపల్లి నియోజకవర్గంలో 15,090మందికి ఇళ్లస్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఆర్‌ఐ. సుగుణమ్మ, వీఆర్‌వో జమునమ్మలు పాల్గొన్నారు.


రీ సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం


వెంకటాచలం, డిసెంబరు 15 : భూసమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ భూ హక్కు - భూ రక్ష పథకాన్ని చేపట్టిందని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ తెలిపారు. మండలంలోని కంటేపల్లి, నాగులవరం గ్రామాల్లో మంగళవారం భూ సర్వేపై నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించి రికార్డులు పరిశిలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు అన్ని తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో తహసీల్థార్‌ ఐఎస్‌ ప్రసాద్‌, సర్వేయర్‌ మల్లికార్జున్‌, ఆర్‌ఐ స్వర్ణలత తదితరులున్నారు. 


Updated Date - 2020-12-16T02:50:11+05:30 IST