సముద్రంలో అల్లకల్లోలం

ABN , First Publish Date - 2020-05-18T10:00:22+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి, బంగాళాఖాతం మఽధ్యప్రాంతంలో

సముద్రంలో అల్లకల్లోలం

వాకాడు, మే 17 : ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి, బంగాళాఖాతం మధ్యప్రాంతంలో తుఫాన్‌గా మారే అవకాశం వుందని మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా ఆదివారం తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. తూపిలిపాళెం ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. రానున్న మూడు రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని, మత్స్యకారులు  వేటకు వెళ్లవద్దని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-05-18T10:00:22+05:30 IST