తూర్పుజంగాలపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-27T02:20:00+05:30 IST

మండలంలోని శెట్టిపాలెం పంచాయతీ తూర్పుజంగాలపల్లిలో శనివారం 10 మందికి తహసీల్దార్‌ ఏ.వీ రమణారావు

తూర్పుజంగాలపల్లిలో  ఇళ్ల పట్టాల పంపిణీ

కొండాపురం, డిసెంబరు26: మండలంలోని శెట్టిపాలెం పంచాయతీ తూర్పుజంగాలపల్లిలో శనివారం 10 మందికి తహసీల్దార్‌ ఏ.వీ రమణారావు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.  మండలంలో మొత్తం 570 మందికి ఇళ్లపట్టాలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ రామక్రిష్ణ, హౌసింగ్‌ ఏఈ భార్గవ్‌, వీఆర్‌వో సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి కే.జోహార్‌ పృథ్వీరాజ్‌,  తదితరులు పాల్గొన్నారు.


లిగిరిలో..


కలిగిరి, డిసెంబరు 26:  మండలంలోని తెల్లపాడు, తూర్పుదూబగుంట గ్రామాల్లో శనివారం ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది.  తహసీల్దారు జీ ఆనందరావు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, రెవెన్యూ, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. కాగా ఆదివారం లక్ష్మీపురం, సిద్దనకొండూరు, సోమవారం నాగసముద్రం, వీర్నకొల్లు గ్రామాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తహసీల్దారు తెలిపారు.


 అల్లూరులో...


అల్లూరు, డిసెంబరు 26 : పేదల పక్కా ఇళ్ల సాకారానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. అల్లూరు మండలం నార్తుఆములూరు వడ్డిపాలెం వద్ద శనివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతోపాటు పక్కా గృహాల నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు లాంఛనంగా అందించామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, దండా కృష్ణారెడ్డి, నీలం సాయికుమార్‌, ఊటు శ్రీకాంత్‌రెడ్డి, బత్తుల మోహన్‌రెడ్డి, పాడేటి డేవిడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T02:20:00+05:30 IST