ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస

ABN , First Publish Date - 2020-12-29T04:11:45+05:30 IST

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస నెలకొన్న ఘటన సోమవారం గుడవళ్లూరు పంచాయతీలో చోటుచేసుకుంది.

ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస

 మధ్యలో ఆపేసి వెళ్లిన అధికారులు

కొండాపురం, డిసెంబరు 28: పేదలకు ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస నెలకొన్న ఘటన సోమవారం గుడవళ్లూరు పంచాయతీలో చోటుచేసుకుంది. తహసీల్దార్‌ ఎ.వి.రమణారావు, డీటీ లక్ష్మీనారాయణలు పంచాయతీలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టారు. అంతా బాగానే ఉన్నప్పటికీ లబ్ధిదారులు కూర్చునేందుకు కుర్చీలు వేయలేదు. ఎండలోనే నిలబడాల్సిన రావడంతో వారు అధికారులను నిలదీశారు. అంతేకాక స్థలం మంజూరైనట్లు ఫొటోలు తీసుకున్నారని నేడు పట్టాలు రాలేదని మరికొందరు ప్రశ్నించారు. మా సంగతి తేల్చాకే పంపిణీ చేయాలని కోరడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పంపిణీని మధ్యలో ఆపేసి రెవెన్యూ అధికారులు వెనుదిరిగి వెళ్లారు.

Updated Date - 2020-12-29T04:11:45+05:30 IST