కొవిడ్‌ నిబంధనలకు లోబడి హాస్టళ్ల నిర్వహణ

ABN , First Publish Date - 2020-12-12T04:56:43+05:30 IST

కొవిడ్‌ -19 నిబంధనలకు లోబడి వసతిగృహాలను నిర్వహించేలా హాస్టళ్ల సంక్షేమాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా

కొవిడ్‌ నిబంధనలకు లోబడి హాస్టళ్ల నిర్వహణ

 జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి వెంకటయ్య

ఆత్మకూరు, డిసెంబరు 11 : కొవిడ్‌ -19 నిబంధనలకు లోబడి వసతిగృహాలను నిర్వహించేలా హాస్టళ్ల సంక్షేమాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి వై.వెంకటయ్య పేర్కొన్నారు. ఆత్మకూరు బీసీ బాలికల వసతిగృహాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మౌలిక వసతులను పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతిగృహాల్లో చేరేందుకు 9, 10 తరగతులు చదివే విద్యార్థులు ఎప్పుడు వచ్చినా వారి తల్లిదండ్రుల అనుమతితో చేర్చుకోవాలన్నారు. సంక్షేమాధికారులు హాస్టల్స్‌లో ఉంటూ విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు. బాలికల హాస్టల్‌లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయన్నారు. మిగతా హాస్టళ్లలో విద్యార్ధులను చేర్చుకునేందుకు సంక్షేమాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్ధులు వసతిగృహాల్లో చేరేందుకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీసీడబ్ల్యూవో ఎం.శీదేవి, హెచ్‌డబ్ల్యూవో మమత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:56:43+05:30 IST