ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-12-14T04:30:17+05:30 IST

పట్టణంలో రూ.15 కోట్లతో నిర్మించనున్న ఏరియా వైద్యశాల భవన నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

కావలి, డిసెంబరు 13: పట్టణంలో రూ.15 కోట్లతో నిర్మించనున్న ఏరియా వైద్యశాల భవన నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి 100 పడకల ఆసుపత్రికి తగిన వసతులు లేవన్నారు. సరికొత్త డిజైన్లతో రెండు అంతస్తులు నిర్మించి ఒక్కో చోట 200 మంది ఓపీ పేషంట్లు కూర్చునే విధంగా నిర్మాణాలు చేపట్టనున్నామని చెప్పారు. 15 నెల ల్లో నిర్మాణం పూర్తి చేయిస్తామన్నారు. భవన నిర్మాణం పూర్తయితే  డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫ్కాప్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, వైసీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ ప్లోర్‌ లీడర్‌ కనమర్లపూడి నారాయణ, దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు, ఏరియా వైద్యశాల సూపరింటెండింట్‌ మండవ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంవో ప్రసూన, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-14T04:30:17+05:30 IST