-
-
Home » Andhra Pradesh » Nellore » homegards
-
పోలీసులతో సమానంగా హోంగార్డుల సేవలు
ABN , First Publish Date - 2020-12-07T04:48:21+05:30 IST
పోలీసులతో సమానంగా హోం గార్డులు అన్ని రకాల సేవలను జిల్లా ప్రజలకు అందిస్తున్నారని, పోలీసు శాఖకు వెన్నెముకలా హోంగార్డుల సేవలు నిలిచి పోతున్నాయని ఎస్పీ భాస్కర్ భూషణ్ కొనియాడారు.

హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్
నెల్లూరు(క్రైం), డిసెంబరు 6: పోలీసులతో సమానంగా హోం గార్డులు అన్ని రకాల సేవలను జిల్లా ప్రజలకు అందిస్తున్నారని, పోలీసు శాఖకు వెన్నెముకలా హోంగార్డుల సేవలు నిలిచి పోతున్నాయని ఎస్పీ భాస్కర్ భూషణ్ కొనియాడారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర హాల్‌లో ఆదివారం హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ పావురాలను, హైడ్రోజన్ బెలూన్లను ఆకాశంలోకి వదిలి పోలీసు బ్యాండ్ మేళతాళాలతో గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులు నీతి నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం నగరంలో హోంగార్డులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పీ వెంకటరత్నం, డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, గాంధీ, పీ శ్రీనివాసరావు, హోంగార్డ్స్ ఆర్‌ఐ పాల్‌రాజ్, పీఆర్వో శ్రీకాంత్, హోంగార్డుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కే రవిబాబు తదితరులు పాల్గొన్నారు.