జాతీయ రహదారిపై ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2020-12-27T04:45:05+05:30 IST

జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వెంకటాచలం మండ లంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర జా

జాతీయ రహదారిపై ప్రమాద ఘంటికలు
డివైడర్లలో గడ్డి మేస్తున్న పశువులు

 డివైడర్ల మధ్య గ్రీనరీపై పర్యవేక్షణ కరువు

 మూగజీవాల రాకతో ప్రమాదాలు

 ట్రాఫిక్‌కు విరుద్ధంగా వాహనాలు 

హైవే సిబ్బంది చర్యలు శూన్యం

వెంకటాచలం, డిసెంబరు 26 : జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వెంకటాచలం మండ లంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. రహదారి మధ్య డివైడర్లలో మొక్కలు, గ్రీనరీ పెంచుతున్నారు. దీంతో హైవే పక్కన ఉన్న గ్రామాల నుంచి మూగజీవాలు పగలు, రాత్రి తేడా లేకుండా మేత కోసం నిత్యం రోడ్డుపైకి వస్తున్నాయి. కొన్ని చోట్ల రహదా రికి అనుకుని ఉన్న పొలాల్లో మూగజీవాలు డివైడర్ల మధ్యన ఉన్న గడ్డి మేసేందుకు రోడ్డుపైకి ఒక్కసారిగా వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా అనేక ప్రమాదాలు జరిగాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయ డంలో హైవే సిబ్బంది పూర్తిగా విఫలమైరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఐదో నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటేనే వాహనచోదకులు భయప

డుతున్నారు. 

అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌

 కొన్ని ప్రధాన కూడళ్లతో పాటు బ్యాంకులు, దాబాలు, హోటళ్ల వద్ద కూడా ట్రాఫిక్‌కు విరుద్ధంగా వాహనాలు నో పార్కింగ్‌ దగ్గర నిలుపుతున్నారు. కాకుటూరు, చెముడు గుంట తదితర ప్రాంతాల్లో రహదారిపై రాంగ్‌ రూట్‌లో  వాహనాలు వెళుతుండడంతో వెనుక వచ్చే వాహనదారు లకు అర్థం కాక ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి.  హైవే మొబైల్‌ వాహనం ఒకటి తిరుగుతూ ట్రాఫిక్‌కు విరుద్ధంగా వాహనాలు ఉంటే పార్కింగ్‌ ఉన్న ప్రదేశాల్లో నిలుపుకోవాలని సూచిస్తుంటారు. కానీ హైవే అధికారులు, సిబ్బంది నామమాత్రంగానే తనిఖీలు చేస్తున్నారనే విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నా హైవే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఒక్కసారి డివైడర్ల మధ్య గడ్డిని తొలగించినట్లయితే మూగజీవాలు రావని, రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని వాహన చోదకులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-27T04:45:05+05:30 IST