చెరువు కాదు.. రామతీర్థం హైస్కూల్‌ అవరణం

ABN , First Publish Date - 2020-12-12T04:55:32+05:30 IST

మండల పరిధిలోని రామతీర్థంలో జడ్పీ ఉన్నత పాఠశాల చెరువును తలపిస్తోంది. ఇటీవల ‘నివర్‌’ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే.

చెరువు కాదు.. రామతీర్థం హైస్కూల్‌ అవరణం
చెరువుని తలపిస్తున్న రామతీర్థం హైస్కూల్‌ ఆవరణం


పట్టించుకోని అధికారులు


విడవలూరు, డిసెంబరు 11: మండల పరిధిలోని రామతీర్థంలో జడ్పీ ఉన్నత పాఠశాల చెరువును తలపిస్తోంది. ఇటీవల ‘నివర్‌’ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే. ఆ వర్షానికి హైస్కూల్‌ నీటితో మునిగిపోయింది. ఈ క్రమంలో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు వీలులేకపోవడంతో వర్షం నిలిచిపోయినా నీరు మాత్రం అలాగే ఉండి, దుర్గంధం వెదజల్లుతోంది. సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవటంతో పాఠశాల విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిలోనే నడుచుకుంటూ ప్రతిరోజు విద్యార్థులు పాఠశాల గదులకు వెళుతున్నారు. ఒక్కో సమయంలో నీటిలో జారి దుస్తులు, పుస్తకాలు తడిసిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-12-12T04:55:32+05:30 IST