కాలే కడుపులకు పట్టెడన్నం....!

ABN , First Publish Date - 2020-04-14T11:24:08+05:30 IST

కరోనా మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలించి, దేశ సరిహద్దులు దాటే వరకు తరిమికొట్టేందుకు మానవతావాదులంతా కలిసికట్టుగా అడుగు

కాలే కడుపులకు పట్టెడన్నం....!

నెల్లూరు (రూరల్‌), ఏప్రిల్‌ 13 : 

కరోనా మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలించి, దేశ సరిహద్దులు దాటే వరకు తరిమికొట్టేందుకు మానవతావాదులంతా కలిసికట్టుగా అడుగు ముందుకు వేస్తున్నారు. సహాయ నిధికి ఆర్థిక చేయూతనిస్తున్న వారు కొందరైతే.. కాలే కడుపులు నింపేందుకు మరికొందరు ముందుకొస్తున్నారు. 


ప్రాణాంతకమైన కరోనా కట్టడి కోసం సోమవారం ఒక్కరోజులోనే దాతలు 12.50 లక్షలు అందజేశారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలో అన్నారు. పెన్‌విర్‌ కంపెనీ ప్రతినిధి మధుసూదన్‌నాయుడు 5 లక్షలు, మేనకూరు కట్టా కమలాకర్‌రెడ్డి రూ.2 లక్షలు, నాయుడుపేట హరేరామ్‌రెడ్డి 1.50 లక్షలు, కె. రాటారెడ్డి 1.50 లక్షలు, పీసీఆర్‌,  బిఎంఆర్‌, భీమయ్యలు రూ.1లక్ష, రాటా శేఖర్‌ 70వేలు, పెళ్లకూరు కె. రామలింగారెడ్డి 50వేలు, అన్నమేడు చంద్రారెడ్డి 30వేలు, ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి 30వేలు, పీ. హరిరెడ్డి 10వేలు, ఓజిలి కొండూరు దామోదర్‌రాజు 50వేలు అందజేశారన్నారు. 


సూళ్లూరుపేటలో నిరుపేదల కోసం షార్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరణి విజయభాస్కర్‌ రెడ్డి, కార్యదర్శి డి.యోగానంద్‌ రెడ్డి  తమ వంతుగా రూ.3 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే కిలివేటికి అందజేశారు. 


జిల్లాలోని పాత్రికేయుల కోసం నెల్లూరులోని లాయర్‌ వార పత్రిక నిర్వాహకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, టీటీడీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులకు  అందచేశారు.


సీతరామపురం మండలంలో పోలీసు, రెవిన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీ, పారిశుధ్య తదితర శాఖల అధికార, సిబ్బందికి టీడీపీ నేత  నేలటూరి జాషువా బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు.


వెంకటాచలంలోని వీఎస్‌యూ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌ హిజ్రాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయాలు పంపిణీ చేశారు. 


నెల్లూరులోని 2వ డివిజన్‌ గుడిపల్లిపాడులో పడిగినేటి రామ్మోహన్‌ ఆధ్వర్యంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డిలు పేదలకు 9 కేజీల కూరగాయలు అందించారు. పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ సౌందర్య, కన్వీనర్‌ సౌజన్యలు 5 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించారు.


6వ డివిజన్‌లో మద్దినేని శ్రీధర్‌ ఆధ్వర్యంలో ముక్కాల ద్వారకానథ్‌ ద్వారా 250 కుటుంబాలకు రూ.2 లక్షలు విలువ చేసే సామాన్లు అందించారు. 16వ డివిజన్‌లో పేదలకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనురాధలు మాస్కులు, హోమియోపతి మందులు అందచేశారు. 


కోవూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి బ్రహ్మయ్య, కమిటీ సిబ్బంది సంయుక్తంగా రూ.50 వేలను ఎమ్మెల్యే ప్రసన్నకు తన మెమోరియల్‌ ట్రస్టుకు అందించారు.


తడ ఎంపీడీవో శివయ్య ఆధ్వర్యంలో అధికారులు వేనాడు పంచాయతీలోని దళిత కాలనీ వాసులకు, తడలోవైసీపీ నాయకులు శేఖర్‌బాబు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు అందించారు. 


ఆత్మకూరు మండలంలోని బసవరాజుపల్లి, రామస్వామిపల్లి, బట్లపల్లి, కోటపాడు, మహిమలూరు గ్రామాలలో వైసీపీ ఇన్‌చార్జి చట్టమూరు రవీంద్రనాథ్‌రెడ్డి 11,800 కేజీ కూరగాయలు పంపిణీ చేశారు. హమాలీ కూలీలకు కో - ఆపరేటీవ్‌ సొసైటీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి నిత్యవసర వస్తువులు పంపిణీ.


కావలిలో నార్తు జనతాపేటలోని రెండవ వీధివాసులు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు నిత్యాసరాలను అందించారు.


గూడూరు కూరగాయల మార్కెట్‌ అసోసియోషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు చవటపాళెంలో కూరగాయలు పంపిణీ, విందూరు, రామలింగాపురం, సంతదాసుపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే వరప్రసాదరావు, కూరగాయలు పంపిణీ చేశారు.


బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన అమెరికావాసులు ఎస్‌.సుబ్రహ్మణ్యం, విజయ తరఫున బెజవాడ గోపాల్‌రెడ్డి నగర్‌కు చెందిన  సోదరుడు శిన్నిరికుప్పం బాలసుబ్రమణ్యం నగర ప్రత్యేకాఽఽధికారికి రూ.25వేల సరకులు అందజేశారు. 


ఇందుకూరుపేటలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉదయగిరి వెంకటశేషాచార్యులు రామాయణం మహేష్‌, మణిశంకర్‌లు పేద అర్చక కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. 

Updated Date - 2020-04-14T11:24:08+05:30 IST