బిల్లుల సమస్యలపై హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
ABN , First Publish Date - 2020-05-17T10:03:35+05:30 IST
విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు నగరంలోని విద్యుత్ భవనలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి

నెల్లూరు ( జడ్పీ ), మే 16 : విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు నగరంలోని విద్యుత్ భవనలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ చార్జీలు పెరిగినప్పటికీ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ కొందరు ఫిర్యాదు చేస్తున్నందున సోమవారం నుంచి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల లోపు 0861 - 2303654కు వినియోగదారులు కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటికే 17 రెవెన్యూ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.