హెడ్‌కానిస్టేబుల్‌ నిజాయితీ

ABN , First Publish Date - 2020-08-18T11:52:28+05:30 IST

జిల్లా పోలీసు కార్యాలయంలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి అందజేసి తన నిజాయితీని చాటాడు ఓ హెడ్‌కానిస్టేబుల్‌. ..

హెడ్‌కానిస్టేబుల్‌ నిజాయితీ

దొరికిన బంగారు గొలుసు బాధితురాలికి అప్పగింత


నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 17 : జిల్లా పోలీసు కార్యాలయంలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి అందజేసి తన నిజాయితీని చాటాడు ఓ హెడ్‌కానిస్టేబుల్‌.  వివరాల్లోకెళితే జిల్లా పోలీసు కార్యాలయంలో పీ1 క్లర్క్‌గా పనిచేస్తున్న గౌరీ ప్రసన్న తన బంగారు గొలుసును పోగొట్టుకుంది. ఆ గొలుసు డీసీఆర్‌బీలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సతీష్‌కు దొరికింది. ఆయన దానిని ఏఎస్పీ వెంటకరత్నంకు అందజేశాడు. ఏఎస్పీ విచారించగా ఆ గొలుసు గౌరీ ప్రసన్నదని తెలుసుకుని ఆమెను తన కార్యాలయానికి పిలిపించి సతీష్‌ చేతుల మీదుగా అందజేశారు. సతీష్‌ను కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందించారు.

Updated Date - 2020-08-18T11:52:28+05:30 IST