-
-
Home » Andhra Pradesh » Nellore » Hanumad vratam
-
భక్తిశ్రద్ధలతో హనుమద్ వ్రతం
ABN , First Publish Date - 2020-12-28T05:19:14+05:30 IST
నగరంలోని రామ మందిరాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఆదివారం హనుమద్ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 27 : నగరంలోని రామ మందిరాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఆదివారం హనుమద్ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకాలు, అకు పూజలు జరిగాయి. శబరి శ్రీరామక్షేత్రంలో విశేష హోమాలు, లక్ష తమలపాకులతో అర్చన, అన్న ప్రసాద వితరణ జరిగాయి. భక్తులు రాసిన రామకోటి పుస్తకాలను మంగళవాద్యాలు, వేదమంత్రాలతో ఊరేగించి రామకోటి స్తూపంలో నిక్షిప్తం చేశారు. ఆలయం చైౖర్మన్ కిషోర్‌రెడ్డి, ధర్మకర్తలు చంద్రారెడ్డి, సుబ్బరాజు పర్యవేక్షించారు. సంతపేట ఆంజనేయస్వామి ఆలయం, పప్పులవీధి ప్రస న్నాంజనేయస్వామి ఆలయం, రాయాజీవీధి ఆంజనేయస్వామి మందిరం, మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయం, అష్టలక్ష్మి ఆలయం, మైపాడుగేటు ఆంజనేయస్వామి మందిరంలోనూ హనుమద్ వ్రతం, ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి.
