తిరుపతి బరిలో శ్యాందన్‌

ABN , First Publish Date - 2020-12-07T04:55:08+05:30 IST

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌(హైరా) జాతీయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు జిల్లాకు చెందిన కూరపాటి శ్యాందన్‌ తెలిపారు.

తిరుపతి బరిలో శ్యాందన్‌
బీ ఫారం చూపుతున్న శ్యాందన్‌

నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 6 : తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌(హైరా) జాతీయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు జిల్లాకు చెందిన కూరపాటి శ్యాందన్‌ తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ పార్టీ పరిశీలకుడు డాక్టరు ఎస్‌ కుమార్‌రాజాతో కలిసి బీ ఫారంను ప్రదర్శించారు. తాను చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయమని హ్యూమన్‌ రైట్స్‌ పార్టీ అధ్యక్షుడు ఎండీ ధృవ అవకాశం ఇచ్చారన్నారు.  

Read more