గూడూరు ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2020-10-14T18:25:30+05:30 IST
గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్ర సాద్‌రావుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది..

లారీని ఢీకొన్న కారు
సురక్షితంగా బయటపడ్డ వరప్రసాద్‌రావు
నాయుడుపేట టౌన్: గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్ర సాద్‌రావుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. నాయుడుపేట - మల్లాం జంక్ష న్ కూడలి ప్రాంతంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రో డ్డు ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల కథనం మేరకు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు తన గన్‌మెన్‌తో కలసి కారులో చెన్నై నుంచి గూడూరుకు వెళ్తున్నారు. నాయుడుపేట - మల్లాం కూడలి వద్దకు రాగానే ముందు వెళు తున్న లారీ సడెన్ బ్రేక్ వేసింది. దాంతో ఎమ్మెల్యే ప్రయాణి స్తున్న కారు ఆ లారీని వెనుక నుంచి ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు డ్రైవర్ హరనాథ్‌రావుకు తీవ్రగాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, గన్‌మెన్ సురక్షితంగా బయట పడ్డా రు. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్‌ఐ వెంకటే శ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మరో వాహనంలో గూడూరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుడు డ్రైవర్ హరినాఽథ్‌రావును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.