ఘనంగా ప్రపంచ పేపర్‌ దినోత్సవం

ABN , First Publish Date - 2020-08-01T10:43:19+05:30 IST

నెల్లూరులోని శ్రీ ఏజెన్సీలో శుక్రవారం ప్రపంచ పేపర్‌ దినోత్సవాన్ని నిర్వహించారు.

ఘనంగా ప్రపంచ పేపర్‌ దినోత్సవం

నెల్లూరు(హరనాథపురం), జులై 31 : నెల్లూరులోని శ్రీ ఏజెన్సీలో శుక్రవారం ప్రపంచ పేపర్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో విజయవాడ పేపర్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పేపర్‌ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ మురళీధర్‌ హాజరై ప్రసంగించారు. బ్యాంకు క్రెడిట్‌ మేనేజర్‌ రమణ పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా పేపర్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఐదు వేల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తామని, రాష్ట్రం మొత్తం మీద 40 వేల మొక్కలు నాటుతామని శ్రీ ఏజెన్సీస్‌ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2020-08-01T10:43:19+05:30 IST