-
-
Home » Andhra Pradesh » Nellore » ghutkha
-
రూ. 2.10 లక్షల విలువైన గుట్కాల స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-11T04:38:18+05:30 IST
మండలంలోని పుదూరు గ్రామంలో రూ. 2.10 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ ఇన్‌చార్జి సీఐ శేషమ్మ తెలిపారు.

నాయుడుపేట టౌన్, డిసెంబరు 10 : మండలంలోని పుదూరు గ్రామంలో రూ. 2.10 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ ఇన్‌చార్జి సీఐ శేషమ్మ తెలిపారు. నాయుడుపేట ఎస్‌ఈబీ కార్యాలయంలో గురువారం ఆమె వివరాలను వెల్లడించారు. పుదూరు గ్రామంలో కృష్ణయ్య తన ఇంట్లో 15,986 గుట్కా ప్యాకెట్లను నిల్వచేసినట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామన్నారు. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.