-
-
Home » Andhra Pradesh » Nellore » Get home and get tested
-
పరీక్షలు చేసుకుని ఇంటికి రా..
ABN , First Publish Date - 2020-03-23T10:18:58+05:30 IST
కర్ణాటక నుంచి వచ్చిన ఓ మత్స్యకారుడిని తన కుటుంబ సభ్యలు నేరుగా ఇంటికి రావద్దని, వైద్య పరీక్షలు చేసుకుని

ఓ మత్స్యకారుడికి కుటుంబ సభ్యుల హుకుం
అల్లూరు, మార్చి 22 : కర్ణాటక నుంచి వచ్చిన ఓ మత్స్యకారుడిని తన కుటుంబ సభ్యలు నేరుగా ఇంటికి రావద్దని, వైద్య పరీక్షలు చేసుకుని రమ్మంటూ హుకుం జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..
బోగోలు మండలం తాటిచెట్లపాలెంకు చెందిన ఇద్దరు, పాతపాలెంకు చెందిన ఏడుగురు, ఇతర తీరప్రాంతాలకు చెందిన ఐదుగురితో కలసి కర్ణాటక నుంచి టెంపో వాహనంలో వచ్చారు. విడవలూరు మండలం, పొన్నపూడి-పెద్దపాలెంకు చెందిన సోమిరెడ్డి అల్లూరులో దిగాడు. అక్కడి నుంచి తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అల్లూరుకు వాహనాన్ని తీసుకురావాలని కోరాడు.
దీంతో అతని కుటుంబ సభ్యులు పూర్తిగా వైద్యపరీక్షలు నిర్వహించుకున్నాక ఎటువంటి కరోనా వైరస్ లేదని నిర్థారించుకున్నాకే ఇంటికి రావాలని హుకూం జారీచేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అల్లూరులో తిరుగుతుడగా స్థానిక విలేకరులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు ఎవ్వరూ లేకపోవడంతో ఓ ఏఎన్‌ఎం జ్వరాన్ని, రక్తపోటును పరిశీలించి ఇవి రెండూ లేవని చెప్పింది. దీంతో అతడు ఊపిరిపీల్చుకుని గ్రామానికి పయనమయ్యాడు.