గేదెల విక్రయంపై దుమారం

ABN , First Publish Date - 2020-12-27T02:14:38+05:30 IST

మండల పరిధిలోని అర్థమాలకు చెందిన ఓ యువకుడు దొరవారిసత్రం మండలం వేణుంబాకకి చెందిన మూడు గె

గేదెల విక్రయంపై దుమారం

పెళ్లకూరు, డిసెంబరు 26 : మండల పరిధిలోని అర్థమాలకు చెందిన ఓ యువకుడు దొరవారిసత్రం మండలం వేణుంబాకకి చెందిన మూడు గెదేలను విక్రయించి సొమ్ముచేసుకున్నట్లు గ్రామంలో దుమారం రేగుతుంది. వేణుంబాక నుంచి తప్పించుకుపోయి అర్థమాలకి చేరుకున్న గేదెలను గమనించిన ఆ యువకుడు వాటిని శుక్రవారం చిత్తూరుజిల్లాకు తరలించి అమ్మినట్లు గ్రామంలో అలజడి రేగింది. ఇలా తప్పిపోయి బయట గ్రామాల నుంచి వచ్చిన గేదెలను ఆ యువకుడు చిత్తూరుజిల్లాలోని మారుమూల ప్రాంతాలకు తరలించి విక్రయించడం పరిపాటైపోయిందని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.


Updated Date - 2020-12-27T02:14:38+05:30 IST