ఆటో ఢీకొని స్కూటరిస్టుకు గాయాలు

ABN , First Publish Date - 2020-12-02T03:43:02+05:30 IST

బుచ్చి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ స్కూటరిస్టు, నెల్లూరు నుంచి బుచ్చికి వస్తున్న ఓ ఆటోను ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని రేబాల పరిధి అమ్మవారితోపు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. నెల్లూరు

ఆటో ఢీకొని స్కూటరిస్టుకు గాయాలు

 బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు1: బుచ్చి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ స్కూటరిస్టు, నెల్లూరు నుంచి బుచ్చికి వస్తున్న ఓ ఆటోను ఢీకొట్టడంతో అతడికి  తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని రేబాల పరిధి అమ్మవారితోపు వద్ద  మంగళవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరు నుంచి స్కూటరిస్టు చేపలు తీసుకుని నెల్లూరుకు వెళ్తుండగా అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన పలువురు 108కు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంటనే వచ్చి బాధితుణ్ణి పోలీస్‌ జీపులో బుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-12-02T03:43:02+05:30 IST