వేములచేడు చెరువుకు గండి

ABN , First Publish Date - 2020-12-05T03:42:45+05:30 IST

మండల పరిధిని వేములచేడు గ్రామ చెరువుకు గండి పడింది.

వేములచేడు చెరువుకు గండి
గండిని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ జయజయరావు

సైదాపురం, డిసెంబరు 4: మండల పరిధిని వేములచేడు గ్రామ చెరువుకు గండి పడింది. తహసీల్దార్‌ జయజయరావు అక్కడికి చేరుకుని ఇసుక బస్తాలతో గండిని పూడ్చి వేసే చర్యలు చేపట్టారు. తురిమెర్ల గ్రామం వద్ద పిన్నేరువాగు ఉదృత్తంగా ప్రవహించడంతో సైదాపురం-పొదలకూరు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులకు నీరు పూర్తిగా చేరి కలుజులు పారుతున్నాయి. వర్షాల వల్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని  రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-12-05T03:42:45+05:30 IST