భూమికోసం కొట్టుకున్నారు

ABN , First Publish Date - 2020-12-31T03:54:05+05:30 IST

మండల పరిధిలోని కుమ్మరిపాళెంలో బుధవారం భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

భూమికోసం కొట్టుకున్నారు

చిట్టమూరు, డిసెంబరు 30 : మండల పరిధిలోని కుమ్మరిపాళెంలో బుధవారం భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమ భూములను లాక్కుని మరొకరికి అప్పగించేందుకు కొందరు ప్రయత్నించడంతో కోర్టును ఆశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, దీంతో తహసీల్దారు ఆ భూములను అప్పగించారని ఓ వర్గం తెలిపింది. ఈ భూములు గతంలో జాయింట్‌ పట్టాలు అని, వాటిని కాదని ఒక్కరి పేరుమీదే పట్టాలు చేయించుకున్నారని  మరో వర్గం ఆరోపించింది. దీంతో ఇరు వర్గాల మధ్య బుధవారం వాగ్వాదం తారస్థాయికి చేరి ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు వర్గాలు తహసీల్దారుకు, పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

Updated Date - 2020-12-31T03:54:05+05:30 IST