-
-
Home » Andhra Pradesh » Nellore » fort workers dharna
-
మా సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-12-29T05:03:36+05:30 IST
తమ సమస్యలు పరిష్కరించా లంటూ కృష్ణపట్నం పోర్టు కార్మికులు సోమవారం కా ర్మికశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

పోర్టు కార్మికుల ఆందోళన
నెల్లూరు (వైద్యం), డిసెంబరు 28 : తమ సమస్యలు పరిష్కరించా లంటూ కృష్ణపట్నం పోర్టు కార్మికులు సోమవారం కా ర్మికశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మోహన్‌రావు, గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. బోనస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ అరియర్స్‌ను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందచేశారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి ఇన్‌చార్జి డీఆర్వో నాగలక్ష్మికి సమస్యలను విన్నవించారు.