వైభవంగా పుష్పయాగం

ABN , First Publish Date - 2020-11-22T04:46:18+05:30 IST

పట్టణంలోని బ్రాహ్మణవీధిలో ఉన్న శ్రీ వళ్లీదేవసేన సమేత శ్రీ కల్యాణ సంతాన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి వైభవంగా పుష్పయాగం నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం
పుష్పయాగంలో శ్రీవళ్లీదేవసేన సమేత శ్రీ షణ్ముగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి

నాయుడుపేట టౌన్‌, నవంబరు 21 : పట్టణంలోని బ్రాహ్మణవీధిలో ఉన్న శ్రీ వళ్లీదేవసేన సమేత శ్రీ కల్యాణ సంతాన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో  శనివారం రాత్రి వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అమ్మవార్లకు 50 రకాల పుష్పాలతో ఉభయదాతలు, వేదపండితులు పుష్పయాగం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఉభయదాతలుగా పెసల కిశోర్‌బాబు-శోభారాణి దంపతులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు చదలవాడ మోహన్‌కృష్ణశర్మ, వేదపండితులు రవిశర్మ, గణేష్‌శర్మ, గాధంశెట్టి రమణయ్య, భక్తులు పాల్గొన్నారు.


Read more