భయం వద్దు... కలెక్టర్‌ భరోసా

ABN , First Publish Date - 2020-11-26T03:12:12+05:30 IST

తుఫానుకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు అండగా తాముంటామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు, సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ భరోసానిచ్చారు.

భయం వద్దు...  కలెక్టర్‌ భరోసా

కోట, నవంబరు 25: తుఫానుకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు అండగా తాముంటామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు, సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ భరోసానిచ్చారు. బుధవారం వారు  కొత్తపట్నం, శ్రీనివాససత్రం గ్రామాల్లోని తుఫాన్‌ షెల్టర్‌లో ఉన్న వారిని పరామర్శించారు.  భోజనం, ఇతర సౌకర్యాలను ఎప్పటికప్పుడు కల్పించాలని తహసీల్దారు రమాదేవి, ప్రత్యేక అధికారి సురేష్‌బాబు, ఎంపీడీవో భవానిని ఆదేశించారు.  ఆయా తుఫాన్‌ షెల్టర్లల్లో 460 మంది దాకా రక్షణ పొందుతున్నారు. ఎస్‌ఐ మహేంద్ర ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను పోలీసులే నరికి దారి సౌకర్యం కల్పించారు.

Read more