మళ్లీ కొట్టుకుపోయిన సూపర్‌ ప్యాసేజ్‌

ABN , First Publish Date - 2020-12-04T04:58:27+05:30 IST

కనుపూరు కాలువ 25వ కి.మీ వద్ద కొట్టుకుపోయిన సూపర్‌ ప్యాసేజ్‌ గోడ స్థానంలో అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన ఇసుక బస్తాలు కూడా కొట్టుకుపోయాయి.

మళ్లీ కొట్టుకుపోయిన సూపర్‌ ప్యాసేజ్‌
కొట్టుకుపోయిన ఇసుక బస్తాలు

నెల్లూరు రూరల్‌, డిసెంబరు 3 : కనుపూరు కాలువ 25వ కి.మీ వద్ద కొట్టుకుపోయిన సూపర్‌ ప్యాసేజ్‌ గోడ స్థానంలో అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన ఇసుక బస్తాలు కూడా కొట్టుకుపోయాయి. గురువారం కురిసిన వర్షానికి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో  నీటి ఉధృతికి బస్తాలు కొట్టుకుపోయినట్లు ఇరిగేషన్‌ ఏఈ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్యాసేజీ పునరుద్ధరణ పనులకు వర్షం వల్ల ఆటంకం కలుగుతోందన్నారు. కాగా, ఇదే కాలువకు 30వ కి.మీ వద్ద పడిన గండిని పూడ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా అక్కడ కూడా వర్షం కారణంగా పనులు జరగలేదన్నారు. శుక్రవారం పనులు కొనసాగిస్తామని తెలిపారు.

Updated Date - 2020-12-04T04:58:27+05:30 IST