పొలాలను ముంచెత్తిన వరద

ABN , First Publish Date - 2020-12-14T04:01:34+05:30 IST

కొండేరు వరద కాలువకు ఆదివారం గండి పడడంతో పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది.

పొలాలను ముంచెత్తిన వరద
పొలాల్లో ప్రవహిస్తున్న నీరు

వరద కాలువకు గండి

కొట్టుకుపోయిన నారుమళ్లు

రాపూరు, డిసెంబరు 13: కొండేరు వరద కాలువకు ఆదివారం గండి పడడంతో పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. ఎర్ర చెరు వుకు కలుజు నుంచి వచ్చే కాలువ కర కట్టలు దెబ్బతినడంతో  చెరువు కింద వున్న పొలాల్లో నీరు చేరింది. కొన్నిచోట్ల ఇసుక, రాళ్లు మేట వేశాయి. నారు మళ్లు కొట్టుకుపోయి తీవ్రనష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయకట్టుదారు సయీద్‌ జేసీబీతో గండిని పూడ్చి పొలాల్లోకి నీరు రాకుండా చర్యలు తీసుకున్నారు. అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో, తానే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితోనే పనులు చేసినట్లు వివరించాడు.

Updated Date - 2020-12-14T04:01:34+05:30 IST