కండలేరుకు వచ్చింది 2 టీఎంసీలే

ABN , First Publish Date - 2020-12-12T04:33:20+05:30 IST

నివర్‌, బురేవి తుఫాన్‌ ప్రభావంతో కండలేరు డ్యాంకు 2 టీఎంసీల నీరు చేరింది.

కండలేరుకు వచ్చింది 2 టీఎంసీలే

రాపూరు, డిసెంబరు 11: నివర్‌, బురేవి తుఫాన్‌ ప్రభావంతో  కండలేరు డ్యాంకు 2 టీఎంసీల నీరు చేరింది. ఈ రెండు తుఫాన్ల కారణంగా భారీగా వరద రావచ్చని ఇంజనీర్లు భావించారు.  పలుచోట్ల డ్యాం రివెట్‌మెంట్‌ కుప్పకూలడం,  మట్టికట్ట పలుచోట్ల కుంగిపోయిందన్న పుకార్లు రావడంతో పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు వరద తగ్గుముఖం పట్టడం, డ్యాంకు 2టీఎంసీల నీరు మాత్రమే రావడంతో ఇంజనీర్లు ఊపిరి పీల్చుకున్నారు. డ్యాంలో శుక్రవారం 58.026 టీఎంసీల నీరు ఉండగా ఇన్‌ఫ్లో 1260, అవుట్‌ ఫ్లో 4500 క్యూసెక్కులు ఉంది.

Updated Date - 2020-12-12T04:33:20+05:30 IST