31 లోగా సచివాలయాలు పూర్తి కావాలి

ABN , First Publish Date - 2020-12-16T05:16:55+05:30 IST

ఈనెలాఖరులో గా సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఆర్‌బీకేల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

31 లోగా సచివాలయాలు పూర్తి కావాలి

కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 15: ఈనెలాఖరులో గా సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఆర్‌బీకేల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వాటి నిర్మాణ పనులపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 15లోగా పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేయాలన్నారు. అర్భన్‌ హౌసింగ్‌ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించే సమయానికి, అర్భన్‌  హౌసింగ్‌ కోసం కేటాయించిన ప్లాట్లలో పనులు ప్రారంభించేలా చూడాల న్నారు. 

Updated Date - 2020-12-16T05:16:55+05:30 IST