చట్టాలను వ్యతిరేకించేది రైతులు కాదు దళారులే

ABN , First Publish Date - 2020-12-30T04:19:22+05:30 IST

కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు చట్టాలను వ్యతిరేకించేది రైతులు కాదని, దళారులేనని బీజేపీ జాతీయ కార్యదర్శి వె.ౖ సత్యకుమార్‌ అన్నారు.

చట్టాలను వ్యతిరేకించేది రైతులు కాదు దళారులే
మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ముత్తుకూరు, డిసెంబరు 29 : కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు చట్టాలను వ్యతిరేకించేది రైతులు కాదని, దళారులేనని బీజేపీ జాతీయ కార్యదర్శి వె.ౖ సత్యకుమార్‌ అన్నారు. ముత్తుకూరులో మంగళవారం జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. రైతు చట్టాలు అమలులోకి వస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని భావించిన దళారులు కొందరు చట్టాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ  ఉద్యమం కేవలం పంజాబ్‌, హర్యానా రాష్ర్టాలకు మాత్రమే పరిమితమన్నారు. అక్కడ దళారులు రైతుల నుంచి కోట్ట రుపాయాలు దోపిడీ చేస్తున్నారన్నారు. సాగు చట్టాల వల్ల  రైతు పండించిన పంటను కనీస మద్దతు ధరకు ఎక్కడైనా అమ్ముకునే వీలు ఉంటుందన్నారు.  బీజేపీ ప్రభుత్వం ఎక్కడ బలపడుతుందేమోనని, నరేంద్రమోదీ నాయకత్వం శాశ్వతం అవుతుందన్న భయంతో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళన చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి, ఆనంద్‌, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నాయకులు మారుతీ రెడ్డి, సురేష్‌రెడ్డి, భరత్‌కుమార్‌, రామ్మోహన్‌, వంశీధర్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, అబ్దుల్‌ షఫీవుల్లా  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:19:22+05:30 IST