తెలుగు రైతు అధ్యక్షుల నియామకం
ABN , First Publish Date - 2020-12-08T05:12:21+05:30 IST
నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల తెలుగు రైతు అధ్యక్ష, కార్యదర్శులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

నెల్లూరుకు ప్రభాకరరెడ్డి
తిరుపతికి రాధాకృష్ణనాయుడు
నెల్లూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల తెలుగు రైతు అధ్యక్ష, కార్యదర్శులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కావలి నియోజకవర్గానికి చెందిన జలదంకి శ్రీహరిని నియమించారు. ఇక తిరుపతి పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడిగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంకు చెందిన ఆర్ రాధాకృష్ణ నాయుడును, ప్రధాన కార్యదర్శిగా సత్యవేడు నియోజకవర్గానికి చెందిన కనపర్తి గోపీనాథ్‌రెడ్డిని నియమించారు.
