పాము కాటుతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-12-20T03:40:21+05:30 IST

పాము కాటుతో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అరవపాళెంలో శనివారం జరిగింది.

పాము కాటుతో రైతు మృతి

చిట్టమూరు, డిసెంబర్‌ 19 : పాము కాటుతో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అరవపాళెంలో శనివారం జరిగింది. స్థానికుడు దువ్వూరు. శివారెడ్డి(55) వరి పైరును పరిశీలిస్తుండగా విష సర్పం కరచింది. దీంతో అక్కడే పడిపోయిన అతనిని  గ్రామస్థులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసింది. యేడాది క్రితం ఆయనభార్య మృతి చెందగా, 8 రోజుల క్రితమే కుమారుడి వివాహం జరిగింది. దీంతో బంధువులు, కుమారుడు శోకసముద్రంలో మునిగిపోయారు. 

Read more